Friday, October 28, 2016

శాంతి మంత్రము


శాంతి మంత్రము
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః |
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి నః పూషా విశ్వావేదాః |
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదము గాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము ఒనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించు గాక. మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక.

No comments:

Post a Comment